పవన్ కళ్యాణ్ సరసన తెలుగు హీరోయిన్.. ఎవరంటే..?

praveen
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ హిట్  మూవీ పింక్  తెలుగు రీమేక్ వకీల్  సాబ్  లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని  అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి సినిమా వకీల్ సాబ్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న వఖిల్ సాబ్  సినిమా కరోనా  వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

 ఇక త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తవక ముందే పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో పిరియాడికల్ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించిన హరీష్ శంకర్ తో మరో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అదే సమయంలో ఓ మలయాళ సినిమా కూడా రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్  కోషిషన్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. నాగ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు తెలుగమ్మాయి అంజలి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ సరసన అయ్యప్పనుమ్  కోషిషన్ రీమేక్ లో  అంజలి అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: