ఇప్పుడు మరో నక్కిలీసు గొలుసు వస్తోందా....?
ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించనున్నాడు. టైటిల్ వచ్చేసి... శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. మరో పలాస వస్తుందని..... నక్కిలీసు గొలుసు ని మించి పోయే సాంగ్ ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు.
ఈసారి మణిశర్మ ఈ శ్రీదేవి సోడా సెంటర్ కి మ్యూజిక్ ఇస్తున్నాడు. భలే మంచి రోజు నిర్మాతలే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ ఫ్యామిలీ కుర్రాడైనా.. ఆ స్టార్ డమ్ ల జోలికి పోకుండా.. సింపుల్ మూవీస్ ని టచ్ చేస్తూ.... సింపుల్ గా మంచి మంచి సినిమాలే తీస్తున్నాడు సుధీర్ బాబు ఈ సినిమాలో కూడా మంచిగ ఆకట్టుకుంటాడు. శ్రీదేవి సోడా సెంటర్ కూడా మంచి మూవీ అవుతుంది. హిట్టు కూడా గ్యారంటీ అనే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. మరి సినిమాని చూడాలంటే ఆగాల్సిందే.