పవన్ కల్యాణ్ ముందు ప్రభాస్ బలాదూర్..
వకీల్ సాబ్ తర్వాత మూడు సినిమాలు లైన్లో పెట్టిన పవన్ కల్యాణ్ ఇటీవలే నాలుగో సినిమా కబురందించారు. అయ్యప్పన్ కోషియమ్ అనే రీమేక్ సినిమాలో పవన్ నటించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పవన్ రోజుకి కనీసం కోటి రూపాయల పారితోషికాన్ని ఈ సినిమాకోసం తీసుకోబోతున్నారట. రీమేక్ మూవీకోసం పవన్ కేవలం 40రోజులు పనిచేస్తారు. దీనికిగాను రెమ్యునరేషన్ గా 30కోట్ల రూపాయలు తీసుకోబోతున్నారట. దీంతోపాటు లాభాల్లో 25శాతం వాటా అదనం. అంటే.. దాదాపుగా రోజుకి కోటి రూపాయల పారితోషికాన్ని అందుకోబోతున్నారు పవన్ కల్యాణ్. టాలీవుడ్ లో మరే ఇతర హీరో కూడా ఆ స్థాయిలో ఇప్పటి వరకూ డిమాండ్ చేయలేదట. ఒకవేళ డిమాండ్ చేసినా కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే రీఎంట్రీతో పవన్ కల్యాణ్ తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారని సంబరపడుతున్నారు ఆయన అభిమానులు.