'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్..?

praveen
ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో రౌడీ హీరో సరసన ఒక పల్లెటూరి అమ్మాయి గా నటించిన ఐశ్వర్య రాజేష్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయి నటించింది ఐశ్వర్య రాజేష్. అయితే ఈ తెలుగు హీరోయిన్ ప్రస్తుతం బంపర్ ఆఫర్ కొట్టేసిన ట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అది కూడా మామూలు సినిమాలో కాదు ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో  ఐశ్వర్య రాజేష్ అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.



 ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్.ఆర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్లు అభిమానుల్లో మరింత అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఇప్పటికే ఒక విదేశీ భామను దర్శక ధీరుడు రాజమౌళి సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట.




 ఇలా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తూండగా.. ఓ  హీరోయిన్ పాత్రలో విదేశీ భామ సెలెక్ట్ అయింది. ఇక మరో హీరోయిన్ పాత్రలో తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను సెలెక్ట్ చేసినట్టు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ అయితేనే సరిగ్గా సరిపోతుంది అని భావించిన జక్కన్న తెలుగు హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు  టిక్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఐశ్వర్య రాజేష్ బంపర్ ఆఫర్ కొట్టేసింది అని అటు టాలీవుడ్లో ప్రేక్షకులు కూడా భావిస్తున్నారట. కాగా  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: