బిగ్ బాస్ 4 : అమ్మా రాజశేఖర్ సేఫ్ అవ్వడానికి కారణం ఏమిటి..?
ఈవారం అనూహ్యంగా హౌస్ లో నుంచి నోయల్ వెళ్లిపోయాడు కాబట్టి.., ఎలిమినేషన్ ని తీసేశారని అంటున్నారు. నిజానికి నోయల్ వెళ్లిపోకుండా ఉండి ఉంటే ఎలిమినేషన్ ప్రక్రియని చేసేవారు. అప్పుడు ఖచ్చితంగా అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవుతారని చాలామంది ప్రిడిక్షన్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వివిధ ఓటింగ్ వెబ్ సైట్స్ లో అమ్మరాజశేఖర్ కి చాలా తక్కువ ఓట్లు కూడా వచ్చాయి. కాబట్టి అమ్మరాజశేఖర్ ఈవారం ఎలిమినేట్ అవుతారని చాలామంది అనుకున్నారు.
అయితే, ఈవారం ఎలిమినేషన్ అనేది లేదని పక్కా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ సమంత వచ్చినపుడు దసరా కాబట్టి ఎలిమినేషన్ జరగదని అనుకున్నారు. అంతేకాదు, గత సీజన్ లో కూడా రమ్యకృష్ణ హోస్ట్ చేసిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అనేది జరగలేదు. అందుకే చాలామంది సమంత వచ్చినపుడు ఎలిమినేషన్ ఉండదనే అనుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా 8వ వారం ఎలిమినేషన్ ని లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.
ఇప్పటికే అఖిల్, లాస్య ఇద్దరూ కూడా సేఫ్ అయ్యారు. ఇక మిగతా వాళ్లు సండే ఎపిసోడ్ లో సేఫ్ అవుతున్నారన్నమాట. ఇలాంటి ఆసక్తికరమైన బిగ్ బాస్ విశేషాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....