బ్రిటిష్ ప్రధానిని బుట్టలో పడేసిన ఐశ్వర్య అందాలు !

Seetha Sailaja
ఐశ్వర్యా రాయ్ అందానికి బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కేమరూన్ కూడా ఫ్లాట్ అయ్యాడు. ఇటీవలే లండన్ వెళ్లిన ఐశ్వర్యా రాయ్‌ని ప్రధాని ఆయన భార్యతో సతీ సమేతంగా సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసిపంపిన సంగతి బ్రిటిష్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. అతిధి మర్యాదలు చేయడమే కాకుండా తమ దేశానికీ మరోసారి రావాల్సిందిగా ఆహ్వానం పలకడం మరింత ఆశ్చర్య౦గ మారింది. బ్రటిష్ ప్రధాని స్థాయిలో డేవిడ్ ఐశ్వర్య కోసం 30 నిముషాలు కేటాయించడం ఆమె రేంజ్ ను సూచిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉండమని సలహాలు ఇవ్వడమే కాకుండా ఐశ్వర్య నటిస్తున్న తర్వాతి ప్రాజెక్టులు ఏమున్నాయంటూ ఆరాతీయడం ఐశ్వర్యకే ఆశ్చర్య౦గ మారిందట. 2010 లో 'గుజారీష్' చేసిన తర్వాత తాను మళ్లీ ఏ సినిమాలు చేయలేదని, తాజాగా 'జజ్బా' ఒప్పుకున్నానని ఐష్ చెప్పడంతో 'జజ్బా' షూటింగ్‌కి లండన్ రావాల్సిందిగా కోరాడు డేవిడ్. హాలీవుడ్‌లో వచ్చిన 'సాల్ట్' మూవీలో అంజెలినా జోలీ పాత్రలోనే ఇప్పుడు ఐష్ ఈకొత్త సినిమాలో కనిపించబోతోందని బాలీవుడ్ టాక్. ఏది ఏమైతేనేమి ఆరాధ్యకి అమ్మయ్యాక కూడా ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యకున్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు అన్న విషయానికి నిదర్శనమే డేవిడ్ ఆహ్వానం. అందుకే బాలీవుడ్ సినిమా రంగంలో ఎందరు బ్యూటీ లు వచ్చినా ఐశ్వర్య స్థానాన్ని ఎవరూ అందుకోలేరు అని అంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: