14 ఏళ్ళకే లైంగిక వేధింపులకు గురయ్యా.. అమీర్ ఖాన్ కూతురు సంచలన వ్యాఖ్యలు..?

praveen
ఈ మధ్యకాలంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని ఈ మధ్య కాలంలో ఎంతో మంది సెలబ్రెటీలు తెర మీదికి వచ్చి సంచలన విషయాలు బయట పడుతూ ఉండడం మరింత సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పటి వరకు తమకు ఎదురైన చేదు అనుభవాలను లైంగిక వేధింపులను  కూడా బయటపెట్టి మొన్నటివరకు సోషల్ మీడియాను ఊపేశారు. ఇప్పటికి కూడా ఎంతో మంది సెలబ్రిటీలు తెర మీదికి వచ్చి తమ చేదు అనుభవాలను చెబుతున్నారు.



 ఇలా సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకు క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ అవుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల కే కాదు సెలబ్రిటీల పిల్లలకు కూడా లైంగిక వేధింపుల తప్పడం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవలే బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్  ఖాన్ కూతురు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా తెలిపటం  ప్రస్తుతం సంచలనం సృష్టించింది.



 ప్రస్తుతం అమీర్ ఖాన్ కూతురు  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. తాను  14 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ అమీర్ ఖాన్ కూతురు ఐరా  ఖాన్  తెలిపింది, ఆ సమయంలో జరిగిన విషయం మాటల్లో చెప్పడం చాలా కష్టం... కానీ ఆ వ్యక్తి ఆ సమయంలో ఎందుకు అలా ప్రవర్తించాడు అన్నది మాత్రం తనకు ఆ తర్వాత అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటో అర్థం చేసుకోవడానికి తనకు ఏడాది కాలం సమయం పట్టింది అంటూ తెలిపింది. ఆ చేదు ఘటనను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాను అంటూ తెలిపింది ఐరా  ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: