ప్రభాస్ అభిమానుల సందేహాల పై భాగ్యశ్రీ క్లారిటీ !

Seetha Sailaja
క్రేజీ టాప్ హీరో ప్రభాస్ కు అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతడు ఊ అంటే చాలు పెళ్ళి చేసుకోవడానికి ప్రముఖ పారిశ్రామిక వేత్తల కుటుంబాలలోని అమ్మాయిల నుండి అనేకమంది క్రేజీ హీరోయిన్స్ వరకు క్యూ కడతారు. అయితే ప్రభాస్ పెళ్ళి విషయమై తన మనసులో మాట బయట పెట్టకుండా కాలం గడిపేస్తున్న పరిస్థితులలో ప్రభాస్ వయసు 40 ఏళ్ళు దాటిపోయింది.


దీనితో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లా ప్రభాస్ మిగిలిపోతాడా అన్న సెటైర్లు కూడ పడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాథే శ్యామ్’ మూవీలో ప్రభాస్ కు అమ్మగా నటిస్తున్న ‘ప్రేమపావురాలు’ ఫేమ్  భాగ్యశ్రీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.


‘రాథే శ్యామ్’ షూటింగ్ మొదటిరోజున ప్రభాస్ తన వద్దకు వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ తన పై తనకు తన చిన్నతనంలో క్రష్ ఉంది అన్న విషయాన్ని చెప్పినప్పుడు తాను షాక్ అయిన విషయాన్ని వివరిస్తూ అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసింది. అంతేకాదు ప్రభాస్ చూపించే అతిధి మర్యాదలు తట్టుకోవడం కష్టం అంటూ ఒక విషయాన్ని గుర్తుకు చేసుకుంది.


ప్రభాస్ తన ఇంటికి తనను తీసుకు వెళ్ళి తన కుటుంబ సభ్యులు అందర్నీ పరిచయం చేయడమే కాకుండా 20 రకాల వంటలతో తనకు భోజనం పెట్టడమే కాకుండా తాను ఇంటికి వెళ్ళేడప్పుడు 15 బాక్స్ ల నిండా రకరకాల స్వీట్స్ ఇచ్చిన ప్రభాస్ ప్రేమను తాను ఎప్పుడు మరిచిపోను అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ‘రాథే శ్యామ్’ మూవీలో ప్రభాస్ తల్లి పాత్రకు తాను సరిపోతానా అంటూ ప్రభాస్ అభిమానులు సందేహ పడుతున్న విషయం తన దృష్టి వరకు వచ్చిందని ఈ మూవీ విడుదల అయ్యాక తాను ప్రభాస్ తల్లిగా ఎలా సరిపోయానో ప్రభాస్ అభిమానులకు తెలుస్తుంది అంటూ ఈమూవీ పై మరింత అంచనాలు పెంచుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: