నేషనల్ అవార్డ్ విన్నర్ సినిమాకు ఉండాల్సిన బజ్ ఎక్కడ..?
కరోనా లాక్ డౌన్ టైమ్మ్ లో కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేదని రెస్పాన్స్ వచ్చింది. ఇక అమ్మడు నటించిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలు కూడా ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. మిస్ ఇండియా సినిమా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ గా సూపర్ క్రేజ్ ఉన్న కీర్తి సురేష్ సినిమాకు అసలు రిలీజ్ ముందు ఎలాంటి బజ్ లేకపోవడం మాత్రం షాకింగ్ గానే ఉంది.
కీర్తి సురేష్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తుంది. మిస్ ఇండియా సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఓటిటిలో కీర్తి సురేష్ రెండో సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత గుడ్ లక్ సఖి కూడా త్వరలో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలతో పాటుగా నితిన్ రంగ్ దే, మహేష్ సర్కారు వారి పాట సినిమాల్లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్ ఇండియా సినిమాను ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు నిర్మించారు.