పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పవన్ కెరీర్ 25వ సినిమా కావడం అలానే పవన్ తో కలిసి త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎంతో అంచనాలు ఏర్పడ్డాయి .కాగా ఈ సినిమా ఫెయిల్ అయిన అనంతరం తన రాజకీయ జీవితంలో పూర్తిగా బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్.
దాని అనంతరం రెండున్నర ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. అలానే దానితో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు పవన్. కాగా వాటిలో వకీల్ సాబ్ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ మాత్రం రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి వకీల్ సాబ్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. కాగా పవన్, క్రిష్ ల సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఇకపోతే దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నారు పవన్. వాటికి సంబంధించి అధికారికంగా ప్రకటనలు కూడా ఇటీవల వచ్చాయి. ఇకపోతే ఇటీవల సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాతగా సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ నటించనున్న మరో సినిమాకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన రావడం జరిగింది. కొన్నాళ్ళ క్రితం మలయాళం లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని మరొక ముఖ్య పాత్రలో నటించే నటుడికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ బయటికి రాలేదు.
అయితే ఆ పాత్రలో గోపీచంద్, జూనియర్, ఎన్టీఆర్, మహేష్ బాబు లలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందని కొంత వార్తలు ప్రచారం అవుతున్న ప్పటికీ నేటి ఉదయం నుండి కొన్ని నగర్ వర్గాల నుండి మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆ ముఖ్య పాత్ర కోసం అక్కినేని హీరో సుమంత్ ని ఎంపిక చేసిందట మూవీ యూనిట్. ఇప్పటికే ఆ పాత్ర కోసం ఫుల్ గా గడ్డం పెంచిన సుమంత్ అన్ని విధాలా దానికోసం రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. అలాగే అతి త్వరలో దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా రానుందని, తొలిసారిగా పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు సుమంత్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!