రాజ్ తరుణ్ కొత్త సినిమా ప్రారంభం..!
ఈ నేపథ్యంలోనే గుండజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రంలో నటించాడు. ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. మాళవిక అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించింది. ఇక ఓటీటీలో విడుదలైన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా 'ఆహా' ప్రమోషన్స్ తో నెమ్మదిగా హిట్ దిశగా పయనించింది. దీంతో ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కొందరు నిర్మాతలు హోప్స్ పెట్టుకుని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో యువ హీరో ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ముందుగా 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాని డైరెక్ట్ చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందనున్న చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు. ఇక రాజ్ తరుణ్ కెరీర్లో 15వ చిత్రంగా రానున్న ఈ మూవీకి సాంటో దర్శకత్వం వహించనున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించనుంది. వీటితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ తరుణ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయట. మరి ఈ సినిమాలతో హిట్స్ అందుకుని రాజ్ తరుణ్ మళ్ళీ ఫార్మ్ ని కొనసాగిస్తాడేమో చూడాలి మరి.