రాజమౌళి ప్రయోగాలు మామూలుగా లేవ్..!

NAGARJUNA NAKKA
బాహుబలితో రేంజ్‌ పెంచుకున్న రాజమౌళి ట్రిపుల్‌ ఆర్‌తో హాలీవుడ్‌పై కన్నేశాడు. సౌత్‌ ఇండియా నటీనటులతో బాహుబలి తీస్తే.. ఇండియావైడ్‌ సూపర్‌హిట్‌ అయింది. బాలీవుడ్‌ ప్రేక్షకులను శాటిస్‌ఫై చేయడానికి  హిందీ నుంచి అజయ్‌దేవగణ్‌, అలియాభట్‌ను తీసుకున్నాడు. జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను పాన్‌ ఇండియా మూవీగా భావించడంలేదు. పాన్‌ ఇంటర్నేషనల్‌గా చూస్తున్నాడు. మరి ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించే హాలీవుడ్‌ నటీనటులు ఎవరో అనే దానిపై చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఎన్టీఆర్‌ పక్కన ఫారిన్‌ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ను ఎంచుకున్నాడు. ఇంకా ఈ అమ్మడు సెట్స్‌లోకి అడుగుపెట్టకుండానే.. ఐరిష్‌ నటి అలిసన్‌ డ్యూడీ షూటింగ్‌లో జాయిన్‌ అయింది. ఈ అమ్మడు సినిమాలో లేడీ స్కాట్‌ పాత్రలో కనిపించనుంది. బ్రిటీష్‌ సంస్థానంలో అధికారిణిగా కనిపించనుందని.. విలన్‌ తరహాగా ఆమె పాత్ర ఉంటుందని టాక్‌.

షూటింగ్ పాల్గొనడానికి అలిసన్ డూడి ఇండియాకు వచ్చింది. ఈ విషయాన్నిచెబుతూ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేశారు. ఒలీవియా మోరిస్‌..అలిసన్‌ డూడీతోపాటు..ఫారిన్‌ యాక్టర్స్‌  కూడా ఇందులో నటించారట. రాజమౌళి సినిమాలో ఇలా ఫారిన్‌ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించడం ఇదే ఫస్ట్ టైం.

రామ్‌చరణ్‌ హీరోయిన్‌గా అలియాభట్‌ నటిస్తోంది. ఈ నెల మొదటివారం నుంచి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ఫారిన్‌ యాక్టర్స్‌ రాకతో ఆమె షెడ్యూల్‌ మారిందని సమాచారం. అలియా ఆర్‌ఆర్‌ఆర్‌ టీంలో డిసెంబర్‌లో జాయిన్‌ కానుంది.

మొత్తానికి దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఎన్నో ఎన్నో అంచనాలున్నాయి. ఆ సినిమాలో నటించే హాలీవుడ్ నటుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పాత్రను బట్టి జక్కన్న వాళ్లను రంగంలోకి దించుతుకున్నారు. పాత్రలకు మరింత హంగు తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా అద్భుతంగా వచ్చేందుకు జక్కన్న మల్చుతున్నారు.

ఆర్ఆర్ఆర్ లో నటించే హాలీవుడ్ నటులెవరో అనే ఉత్కంఠ సగటు ప్రేక్షకునిలో ఉంది. అయితే అందులో ఎవరు నటిస్తున్నారనే దానిపై కొంత క్లారిటీ వచ్చేసింది. వాళ్లతో రాజమౌళి ఎలాంటి ప్రయోగాలు చేయిస్తున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: