కాజల్ డెడికేషన్ కి హర్షం వ్యక్తం చేస్తున్న నిర్మాతలు....!!!
కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఎప్పుడెప్పుడు సెట్స్ లోకి అడుగు పెడదామా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిబట్టి తన పని విషయంలో కాజల్ ఎంత నిబద్దతతో ఉంటారో అర్ధమవుతోంది. పెళ్లి సందడికి తాత్కాలిక విరామాన్ని ఇచ్చి వెంటనే సెట్స్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. పెళ్లికి ముందు కాజల్ కొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ను లైట్ తీసుకుంటే నిర్మాతలకు నష్టం కలుగుతుందని భావించిన ఆమె షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ఈ నెల 10న షూటింగ్ పాల్గొనడానికి ఆమె ఏర్పాట్లు చేసుకున్నారు. తమిళంలో ‘హే సినామికా’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోనున్నట్లు యూనిట్ కి ఈ పంచదార బొమ్మ సమాచారం అందించిందట. దీంతో చిత్రనిర్మాతలు ఆమె నిబద్ధతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.