డబ్బే డబ్బు : గ్రాండ్ గా ఎంటర్ కాబోతున్న గ్రాండ్ ఫార్మా !
ఇలాంటి పరిస్థితులలో ఈ నెల 9న ప్రారంభం కాబోతున్న గ్రాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ మార్కెట్ లో పెను సంచలనం సృష్టిస్తుంది అంటూ అంచనాలు వస్తున్నాయి. 10 రూపాయల షేర్ ను 1490-1500 లుగా నిర్ణయిస్తూ కనీసం 10 షేర్ లకు బీడ్ దాఖలు చేయాలి. ఆతరువాత 10 గుణిజాల్లో ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు.
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా గ్రాండ్ ఫార్మా కంపెనీ సుమారు 6,500 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్ కు మరింత కళ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల పై వస్తున్న లేటెస్ట్ సర్వేలు బైడెన్ వైపు మొగ్గు చూపడంతో ప్రస్తుతం ఇండియాలో ఫార్మా కంపెనీల షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడబోతోంది.
దీనికితోడు ఇండియా అమెరికాకు చేసే ఎగుమతులలో ఎక్కువ శాతం ఫార్మా ఐటి రంగాలు ఉండటంతో రానున్న రోజులలో ఈ రెండు రంగాలకు చెందిన షేర్లకు మంచి కళ వస్తుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా షేర్ మార్కెట్ కళకళలాడటం వెనుక మరొక కారణం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఏ పార్టీకి చెందిన అధ్యక్షుడు ఎంపిక అయినా అతి తక్కువ మెజారిటీతో ఎంపిక అవుతున్నాడు కాబట్టి అతడు అవలంభించే విధానాలకు ప్రతిపక్ష పార్టీల సహాయం కూడ అవసరం కాబట్టి ఇప్పట్లో షేర్ మార్కెట్ ఉత్సాహాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనిపించక పోవచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి..