ఈ సినిమా పాజిటివ్ బజ్ మిస్ అవ్వడానికి కారణం ఏమిటి...?
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాల పై ఓవర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రేమ కథల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు.. టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి కాంబో సెట్ కావడం తో సినిమా హిట్ అవుతుందనే టాక్ విన్పించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన కొద్ది కాలానికే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైన ఈ 'లవ్ స్టోరీ' సినిమా పై ఏర్పడిన పాజిటివ్ బజ్ ప్రస్తుతం కన్పించడం లేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. చివరి దశకు చేరుకునన్నా కూడా సైలంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇది ఇలా ఉండగా.... ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా? లేదా ఓటీటీలో రిలీజు అవుతుందా? వంటి అప్డేట్స్ కూడా రాలేదు. మరి ఎప్పుడు చెబుతారన్నది కూడా ప్రశ్నార్ధకమే. దీంతో 'లవ్ స్టోరీ'ని జనాలు పట్టించుకోవడం లేదా? లేక చిత్రయూనిట్ ఇప్పట్లో ప్రమోషన్ ఎందుకని సైలంట్ అయ్యారా?అనేది కూడా అర్ధం కావడం లేదు. సినిమా ప్రారంభం చూపినంత ప్రభావం చివర్లో చూపించడం లేదని కాస్త నిరాశ పడుతున్నారు అభిమానులు.