దారుణంగా బిగ్ బాస్ రేటింగ్స్.. ఇలా అయితే కష్టమే బాసు..!

shami
బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్స్ లో షాక్ ఇస్తుంది. ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ టి.ఆర్.పి రేటింగ్స్ తో షో రన్ అవుతుంది. షోని ఆడియెన్స్ రీచ్ అయ్యేలా చేయడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. వీకెండ్ లో నాగార్జున ఎపిసోడ్స్ మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంతూ మిగతా వారం మొత్తం హౌజ్ మేట్స్ గొడవలతోనే షో నడుస్తుంది. అది ఆడియెన్స్ ను పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. హౌజ్ లో టాస్కులు, ఆటల కన్నా మిగతా విషయాల మీద హౌజ్ మేట్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

మాములుగా అయితే వీకెండ్స్ లో 11 అలా రేటింగ్స్ వచ్చేవి.. ఈసారి కూడా నాగ్ ఎపిసోడ్స్ కు 10 ప్లస్ రేటింగ్స్ వస్తున్నాయట. వీక్ డేస్ లో 8 ప్లస్ అలా రేటింగ్స్ రావాల్సి ఉండగా మరీ దారుణంగా 5, 6 రేటింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందట. అదేంటి బిగ్ బాస్ బజ్ బయట బాగానే ఉంది కదా మరి ఇలా ఎందుకు అవుతుంది అంటే ఒకవేళ బిగ్ బాస్ ను కూడా టివిలో కన్నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్కువమంది చూస్తున్నారేమో అన్న డౌట్ కూడా ఉంది.

ఎలా చూసినా సరే ముందు షోస్ కన్నా ఈ సీజన్ ఆశించిన స్థాయిలో బిగ్ బాస్ లేదన్నది టాక్. అయితే నాగార్జున మాత్రం 5 కోట్ల ఓట్ల్స్ వచ్చాయంటూ ఊరిస్తున్నారు. హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ కు ఎంకరేజ్ మెంట్ గా ఇది చెబుతున్నా సరే బిగ్ బాస్ సీజన్ 4 మాత్రం ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయట్లేదు అన్నది అందరు అనుకుంటున్న మాట. సగం రోజులు పూర్తి చేసుకున్న ఈ సీజన్ మిగతా సగం రోజులు ఎలా అలరిస్తుందో చూడాలి.            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: