ఇది ఫిక్స్ చేస్తే పుష్ప కి ఎలాంటి ఢోకా ఉండదు..?
ముందుగా ఈ సినిమా లో విలన్ కోసం విజయ్ సేతుపతి అని అనుకున్నారు.. కానీ లాక్ డౌన్ వల్ల కాల్ షీట్స్ అన్నీ అటుఇటు కావడంతో అతను ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నాడు. ఆ తర్వాత బాబీ సింహ ని నటింపచేయాలని అనుకున్నారు.. ఎందుకో ఆయన్ని కూడా చివరి నిమిషంలో రిజెక్ట్ చేశారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ ని కూడా ట్రై చేశారు.. అయన కూడా ఆసక్తి చూపలేదు. నారా రోహిత్, అరవింద్ స్వామి, ఇలా తమిళ హీరోలను సౌత్ ఇండస్ట్రీ మొత్తం ట్రై చేసినా ఎందుకో వర్క్ అవుట్ చేయలేకపోతున్నారు..
ఇక తాజాగా నార్త్ నటులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది..అయితే అతను ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లాంటి మీడియం రేంజ్ సీనియర్ స్టార్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదొక్కటి ఫిక్స్ అయితే పుష్పకు ఇంకెలాంటి అడ్డంకులు ఉండవు. చకచకా పూర్తి చేసుకోవచ్చు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా బన్నీ డిసైడ్ అయినట్టు తెలిసింది.అది సుకుమార్ మేకింగ్ స్టైల్ కి విరుద్ధం. కానీ ఈసారి తప్పేలా లేదు.