ముంబైలో ఆదిపురుష్ మూవీ యూనిట్ ని కలుసుకున్న హీరో ప్రభాస్

Suma Kallamadi
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సరికొత్త సినిమాలకు ఒప్పుకుంటూ అభిమానుల్లో జోష్ నింపు తున్నారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన మోషన్ విడుదలైన సంగతి విధితమే. ఈ మోషన్ పోస్టర్ అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచేసింది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తవుతోంది.


నివేదికల ప్రకారం ప్రభాస్ ఇటలీ నుండి ముంబైకి చేరుకొని ఆదిపురుష్ చిత్ర బృందాన్ని కలిశారని తెలుస్తోంది. బూడిద రంగు జాకెట్ ధరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన మొహాన్ని మాస్క్ తో కవర్ చేసుకున్నారు. రాధేశ్యాం చిత్రానికి సంబంధించిన సెగ్మెంట్ పూర్తి చేసి.. అనంతరం ముంబై నగరానికి చేరుకొని ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓమ్ రౌత్ ని కలుసుకొని.. మూవీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్ ఈ చిత్రానికి సంబంధించిన పాత్రల గురించి అడిగి మరీ తెలుసుకొనున్నట్టు సమాచారం.


రాధ కృష్ణకుమార్ రూపొందించబోతున్న రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే ప్రభాస్ ఒక వారం రోజుల పాటు యూరప్ వెళ్లి కొద్దిరోజుల పాటు ఎంజాయ్ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


టీ సిరీస్ నిర్మాణ సంస్థ తో కూడా ప్రభాస్ కాసేపు ముచ్చటించనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. జనవరి 2021 సంవత్సరం లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2022 లో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని టేకప్ చేసి పూర్తి చేశారు. అలాగే రామ్ చరణ్.. రాజమౌళి, అలియా భట్, మిగతా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టేక్ అప్ చేయాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: