కమల్ విక్రమ్ సినిమా వెనుక ఇంత కథ ఉందా..?

P.Nishanth Kumar
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2  సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..సెన్సేషనల్ దర్శకుడు శంకర్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. రోబో తర్వాత అయన దర్శకతంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా హీరోలు శింబు, సిద్ధార్థ్ లు ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు..  అయితే ఈ సినిమా ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఆదినుంచి ఈ సినిమా కి అడ్డంకులు వస్తున్నాయి.. తొలుత నిర్మాతలకు, దర్శకుడికి పొసగక ఈ సినిమా షూటింగ్ జరగలేదు..

కమల్ జోక్యంతో అంతా సద్దుమణిగి  షూటింగ్ కి వెళ్తుంది అనుకుంటే షూటింగ్ లో క్రేన్ ప్రమాదం పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది.ఈ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి.. కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు తిరిగి ప్రారంభం కాలేదు.. అన్ని సినిమాలు చక చక షూటింగ్ కి వెళ్లిపోతుంటే శంకర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు.. దాంతో అసలు ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందా అని అందరు తెగ చర్చించుకున్నారు.. ఇదిలా ఉంటె కమల్ ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు..

కార్తి ఖైదితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి విక్రమ్ అనే టైటిల్ ని పెట్టి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకో స్టార్ హీరో పేరుని ఇలా పెట్టుకున్నారేంటా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు లేకపోలేదు . కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విక్రమ్ టైటిల్ తో కమల్ ఎప్పుడో 1986లోనే ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ అప్పట్లో పెద్ద హిట్టు.దానికి deenikiఉంది కాబట్టే లోకేష్ కనకరాజ్ ఏరికోరి మరీ విక్రమ్ టైటిల్ ను ఎంచుకున్నాడు. నిన్న విడుదల చేసిన టీజర్ లో కమల్ ని భోజన ప్రియుడిగా చూపిస్తూనే ఇంటి నిండా మారణాయుధాలను ఎక్కడెక్కడో దాచినట్టు రివీల్ చేయడం ఆసక్తికరంగా ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: