విక్టరీకి అదిరిపోయే షాక్ ఇచ్చిన మోహన్ లాల్..!
ఇక చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది దృశ్యం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు మోహన్ లాల్. ఇప్పటికే జీతూ జోసెఫ్ చెప్పిన కథ కథనాలు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు మోహన్ లాల్. ఈ చిత్ర సీక్వెల్ ఆగస్ట్ 17న ప్రారంభం కావాల్సింది. కేవలం 46 రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసాడు దర్శకుడు. నవంబర్ 8న దృశ్యం 2 పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు యూనిట్.
అయితే ఈ సినిమా కోసం మోహన్ లాల్ అభిమానులు వేయికళ్ళతో వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. తొలి భాగంలో ఉన్న వాళ్లంతా రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతున్నారు. కళాభవన్ మణి చనిపోవడంతో ఆయన స్థానంలో మరొక్కరిని తీసుకున్నారు. ఇదిలా ఉంటే దృశ్యం 2 సినిమాను తెలుగులో అనువదించి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు మోహన్ లాల్. దాంతో వెంకటేష్‌కు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. తెలుగులో డబ్బింగ్ చేయకపోతే కచ్చితంగా వెంకీకి మంచి సినిమా వచ్చుండేది.. కానీ మోహన్ లాల్ మాత్రం అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెప్పేస్తున్నాడు.