ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి హీరోయిన్ దొరికేసింది...!!

Anilkumar
టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇటీవలే అల్లు అర్జున్ తో 'అల వైకుంఠ పురములో' సినిమాతో ఇండ్రస్టీ హిట్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ ని సైతం కొల్లగొట్టింది. ఈ సినిమా విజయంతో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి అగ్ర హీరోలు ముందుకొస్తున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమాను ప్రకటించారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అరవింద సమేత సినిమా వచ్చి.. మంచి విజయం సాధించింది. ఇప్పుడు రెండవ సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా కావడం విశేషం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్టు పనులు పూర్తి చేశాడు.
 ఎన్టీఆర్ రావడమే ఆలస్యం. సినిమాని పట్టాలెక్కించేస్తాడు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 'RRR'షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తారక్.. త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పై తీసుకెళ్లనున్నాడు.ఇదిలా ఉంటె ఈ సినిమాలో ఇప్పుడు కథానాయిక ఎంపికపై కూడా త్రివిక్రమ్ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చేశాడని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పూజా హెగ్డే పేరు దాదాపు ఖాయం అనుకుంటున్నారు. అయితే. హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు టాక్‌. పూజాని పక్కన పెట్టి, కీర్తి సురేష్‌ని ఎంచుకోవాలని భావిస్తున్నాడట.
 అజ్ఞాతవాసిలో కీర్తిని ఏరి కోరి ఎంచుకున్నాడు త్రివిక్రమ్.అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకే. ఈసారి హిట్ సినిమా ఇవ్వాలని ఫిక్సయ్యాడట. ఎన్టీఆర్ - పూజా కాంబోని గతంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో చూసేశారు ప్రేక్షకులు. అందుకే ఈ సారి ప్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్.. కీర్తీ సురేష్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.మరి ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్, కీర్తి ల జంటని మొట్ట మొదటిసారి వెండితెరపై చూడవచ్చు.ఇక వార్తలో నిజం ఎంతో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: