వైరల్ గా మారుతున్న ప్రభాస్ రాముడి లుక్.. ఫిదా అయిన ఆదిపురుష్ దర్శకుడు...!!

Anilkumar
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఏకైక నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి విజయంతో మన డార్లింగ్.. నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు.అందుకే కేవలం అభిమానులే కాదు.. ఇక ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్‌' సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంది.ప్రస్తుతం అక్కడి పరిసర ప్రాంతాల్లో ప్రభాస్, పూజలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ప్రభాస్ తన తదుపరి సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఆదిపురుష్' అనే సినిమాలో నటిస్తున్నాడు.

 భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగాన్ని అందుకున్నాయి. దర్శకుడు ప్రభాస్ లుక్ పై కూడా ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓం రావత్ రాముడి పాత్ర డిజైన్ గురించి క్లారిటీ ఇచ్చిన తరువాతనే ప్రభాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.సినిమాలో ప్రభాస్ రాముడిగా ఎలా కనిపిస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ కూడా చాలానే వైరల్ అవుతున్నాయి. ఈ రోజులల్లో అభిమానులే వారి హీరో ఎలా ఉండాలో దర్శకులకు ఒక హింట్ ఇస్తున్నారనే చెప్పాలి. ఇటీవల ఆదిపురుష్ కి సంబంధించిన ఒక స్పెషర్ కూడా పోస్టర్ చిత్ర యూనిట్ ని తాకింది.దర్శకుడు ఓం రావత్ కూడా ఆ పోస్టర్ ని చూసి ఎట్రాక్ట్ అయ్యారు.

 సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎడిట్ చేసిన వారిని అభినందించారు. నిజంగా అద్భుతంగా ఉందని ఆయన చెప్పకనే చెప్పినట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర ఇలానే ఉంటుందేమోనని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.నిమిషాల్లోనే ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే ప్రభాస్ లుక్ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తాజాగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: