విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్న బాలయ్య...
సాయేషా ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తరువాత కోలీవుడ్‌కి వెళ్ళిపోయింది. అక్కడే వరుస అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయిపోయింది. స్టార్ హీరో ఆర్యని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి అయినప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో అంగీకరించింది.
సాయేషా వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఈ ఇరవై ఏళ్ల బ్యూటీ అరవై ఏళ్ల హీరో సరసన నటిస్తుండడంపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూతురి కన్న తక్కువ వయసు వున్న అమ్మాయితో సినిమా చెయ్యటం ఏంటని బాలయ్యని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..