వర్మ మన కర్మ సభలో వర్మ సెటైర్లు !

Seetha Sailaja
ఒక వ్యక్తిని విమర్శిస్తూ ఎవరైనా ఒక పుస్తకాన్ని రాస్తే ఆపుస్తకాన్ని చదవడానికి కూడ ఆప్రముఖ వ్యక్తి అంగీకరించడు. అయితే తన పై ఒక రచయిత్రి నెగిటివ్ హెడ్డింగ్ తో వ్రాసిన పుస్తకాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఆవిష్కరించడమే కాకుండా ఆ ఆవిష్కరణ సభకు వర్మ తల్లి కూడ రావడం షాకింగ్ న్యూస్ గా మారింది.


యువ ర‌చ‌యిత్రి రేఖ ప‌ర్వ‌తాల రామ్ గోపాల్ వర్మ జీవితాన్ని చాల నిశితంగా పరిశీలించి వ్రాసిన పుస్తకం ‘వర్మ మన కర్మ’ వర్మకు కుటుంబ బాంధవ్యాలు అన్నా సెంటిమెంట్స్ అన్నా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో వర్మ జీవితం పై తీస్తున్న బయోపిక్ ఫంక్షన్ లోను వర్మ జీవితం పై వ్రాసిన పుస్తక ఫంక్షన్ లోను వర్మతో పాటు అతడి తల్లి కూడ కనిపించడంతో వర్మకు కుటుంబ బాంధవ్యాల పై మోజు పెరిగిందా అని అనిపించడం సహజం.


అయితే లేటెస్ట్ గా జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో వర్మ తల్లి సూర్యావతి తో పాటు సోదరి విజయ కూడ కనిపించడం మరింత ఆశ్చర్యంగా మారింది. ప్రముఖ ఛానల్ న్యూస్ ఎడిటర్ స్వప్న తో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో వర్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. మొదట్లో ఈ పుస్తకం హెడ్డింగ్ చూసి తాను చదవ కూడదు అనుకున్నానని అయితే తనకే తెలియని కొన్ని లక్షణాలు ఈ పుస్తకంలో విశ్లేషించినట్లు తెలిసి ఈ పుస్తకం ఆసక్తితో చదివాను అని అంటున్నాడు.


ప్ర‌తి మ‌నిషిలో మృగం ఉంటాడు అని చెపుతూ అయితే చాలామంది తమలోని చెడును దాచుకుని మంచిగా కనిపించాలి అన్న ప్రయత్నంలోనే వారి జీవితం ముగుస్తుందని అయితే తాను అందుకు విరుద్ధం అని అంటున్నాడు. తాను అనుకున్న‌దే చేస్తాన‌ని జీవితంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఎప్పుడూ త‌న ఖ‌ర్మ అనుకోలేద‌ని వర్మ కొత్తగా వేదాంతం మాట్లాడాడు. అంతేకాదు రచయిత్రి రేఖ తన కోసం ఒక్క సంవత్సరం జీవితం వ్యర్థం చేసుకుని ఇలా పుస్తకం వ్రాసే బదులు ఆమె గురించి ఆలోచించుకుని ఏదైనా మంచి పని చేసుకుంటే బాగుండేది కదా అంటూ ఆమె పై సెటైర్ వేసాడు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: