నాగ చైతన్య ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కను నాటిన రకుల్ ప్రీత్ సింగ్..!!

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్.. ఆ సినిమా లో తన అమాయకత్వపు నటన, అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. అక్కడితో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరుస అవకాశాలువచ్చాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చోటు సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామకి ఈ మధ్య టాలీవుడ్ లో సరైన హిట్ రాలేదు. ఇటీవలే నాగార్జున తో కలిసి మన్మధుడు 2 లో నటించిన ఈమెకి ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.అటు బాలీవుడ్ లో కూడా అడపా దడపా సినిమాల్లో నటించిన.. అవి కూడా ఈమె కెరీర్ కి ప్లస్ అవ్వలేదు. దానితో పాటు ఈ మధ్య రకుల్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

 బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తో డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వెలుగులోకి రావడంతో ఈమె కోర్టు దాకా కూడా వెళ్లింది. ఈ విషయం పక్కన పెడితే ఇటీవలే రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" ఇప్పుడు అపూర్వ స్పందనతో ముందుకు సాగుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. తమ ఆత్మీయులను నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కినేని హీరో నాగచైతన్య విసిరిన ఛాలెంజ్ ను టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ స్వీకరించారు.

ఈ రోజు జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలు నాటిన రకుల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది...! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: