రాజమౌళికి షాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ...?
ఏదో ఒక వింత పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించడం రామ్ గోపాల్ వర్మ కు ఎంతో ఇష్టం.... ఆ పని ఇతరుల ప్రశంసించేదా...? లేక విమర్శించేదా...? అన్నది తర్వాత విషయం..... అయినా వీటిపై పెద్దగా ఫోకస్ పెట్టడు వర్మ. ఇతరుల ఏమనుకుంటారో అన్న అంశాన్ని అసలు ఆలోచించకుండా తనకు నచ్చింది తను చేసుకు పోతాడు ఈ డిఫరెంట్ డైరెక్టర్. తరచూ వివాదాల్లో చిక్కుకొనే వర్మ... ఇప్పుడు మరో విమర్శ ఎదుర్కొనే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ విషయం ఏమిటంటే...
రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ని తిరస్కరించాడు వర్మ. ప్రస్తుతం ప్రముఖ తారల మధ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఇటీవలే చరణ్ మొక్కలు నాటి తన ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్ అయిన జక్కన్న రాజమౌళి.. హీరోయిన్ ఆలియా భట్ ఇంకా అభిమానులను ఛాలెంజ్ చేశారు. చరణ్ ఛాలెంజ్ ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి నేడు తన ఆర్ఆర్ఆర్ టీం అందరితో కలిసి మొక్కలు నాటాడు. నాటిన ఫొటోను ట్వీట్ చేసి... తోటి దర్శకులు అయిన రామ్ గోపాల్ వర్మ.. వివి వినాయక్.. పూరిలను నామినేట్ చేసి ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరాడు. అయితే గంటకే స్పందించిన వర్మ ఈ చాలెంజ్ ను తిరస్కరించాడు.
ఇలాంటి ఛాలెంజ్ లను స్వీకరించలేను. అందులోనూ మట్టిన ముట్టుకునేందుకు అస్సలు ఆసక్తిని చూపించను. నాకు మట్టిని తాకడం అంటే అసహ్యం అంటూ నిర్మొహమాటంగా మాట్లాడాడు. మొక్కలు అనేవి కేవలం మంచి వ్యక్తులకు మాత్రమే అర్హమైనవిగా నా అభిప్రాయం. నాలాంటి స్వార్థ పరులకు ఆ మొక్కలు సూట్ కావు అని...మీకు మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్ అంటూ మరోసారి తన భిన్నమైన శైలి లో రెస్పాండ్ అయ్యారు వర్మ. మరి ఇ దీనిపై రాజమౌళిి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది