హీరో, హీరోయిన్లు అందుకోసం తెగ కష్టపడుతున్నారు..!

NAGARJUNA NAKKA
హీరోలు గతంలో మాదిరి  మేకప్‌ వేసుకొని... కెమెరా ముందు నుంచుని వెళ్లిపోతే సరిపోదు. కెమెరా ఫేస్‌ చేయడానికి ముందే... చెమటలు కక్కాలి. తెలీని విషయాలు నేర్చుకోవాలి. కథ.. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేయడంతో... సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే... నేర్చుకునే ప్రాసెస్‌లో మన హీరోలు బిజీగా ఉంటున్నారు.

అల వైకుంఠపురంలో బన్నీ ఎంచక్కా స్టైలిష్‌గా మాట్లాడుతూ.. స్టైలిష్‌గా డ్యాన్స్‌ చేస్తూ.. స్టైలిష్‌గా ఫైట్స్‌ చేసేసి బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు. నెక్ట్స్‌ మూవీ పుష్పలో లారీ డ్రైవర్‌గా రఫ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. అల వైకుంఠపురంలో మాదిరి స్టైలిష్‌ టచ్‌ ఇస్తే సరిపోదు. వేషమే కాదు భాష కూడా మారింది.

పుష్ప రాయలసీమ బ్యాక్ డ్రాప్ ‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో హీరోహీరోయిన్లు బన్నీ, రష్మిక  చిత్తూరు యాసలో మాట్లాడతారు.  ఆల్రెడీ ఈ ఇద్దరూ శిక్షణ తీసుకున్నారు. గతంలో రుద్రమదేవిలో పోషించిన  గోన గన్నారెడ్డ రోల్‌ కోసం తెలంగాణా మాండలికం నేర్చుకున్నాడు బన్నీ.

ఈ మధ్యకాలంలో హీరోలు ఎక్కువగా తెలంగాణ... రాయలసీమ స్లాంగ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. అరవింద సమేత వీర రాఘవలో రాయలసీమ యాసతో ఇంప్రెస్‌ చేసిన తారక్‌.. ఆర్ఆర్‌ఆర్‌ కోసం... తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతున్నాడు.

సాధారణంగా ఈ స్లాంగుల జోలికి వెళ్లని వెంకటేశ్‌.. రీమేక్‌ మూవీ కోసం రాయలసీమ యాసను నేర్చుకున్నాడు. తమిళంలో హిట్‌ మూవీ 'అసురన్‌' తెలుగు రీమేక్ నారప్పలో  వెంకటేశ్‌ నటిస్తున్నాడు.  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ఇందులో వెంకటేశ్‌ రాయలసీమ యాసను ఎలా పలుకుతాడో చూడాలి.  

ఇక హీరోయిన్స్‌ విషయానికొస్తే.. యాసలో మాట్లాడడం చాలా అరుదు. ఆమధ్య ఫిదాలో సాయిపల్లవి నోటివెంట వచ్చిన తెలంగాణ డైలాగ్స్ హైలైట్‌ అయ్యాయి. ప్రస్తుతం తమన్నా కూడా తెలంగాణాలోనే నల్గొంగ తరహా స్లాంగ్‌ను ట్రై చేస్తోంది. గోపీచంద్‌తో కలిసి నటిస్తున్న 'సీటీమార్‌' మూవీలో తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా నటిస్తోంది.

గెటప్‌లో.. క్యారెక్టరైజేషన్‌లో పెద్దగా వేరియేషన్స్‌ చూపించని నాగచైతన్య కూడా మారిపోయాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న 'లవ్‌స్టోరీ'లో తెలంగాణ యువకుడిగా చైతు నటిస్తున్నాడు. దర్శకుడి గత చిత్రం ఫిదాలో సాయిపల్లవి... ఇప్పడు నాగచైతన్య తెలంగాణ స్లాంగ్‌ను ప్రాక్టీస్‌ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: