ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' మూవీ ఈ నెల 10వ తేదీన షూటింగ్ మొదలుపెట్టింది. షూటింగ్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలైంది. స్పెషల్ గెటప్‌తో ఈ సినిమా సెట్స్‌పై అడుగుపెట్టాడు అల్లు అర్జున్. లాక్ డౌన్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని అన్ని జాగ్రత్తలతో రంగంలోకి దిగింది పుష్ప టీమ్.
ఈ చిత్ర బృందం తాజాగా.. ''పుష్పరాజ్ వచ్చేసినాడు'' అంటూ అడవిలో ఎంట్రీ ఇస్తోన్న అల్లు అర్జున్ ఫోటోను విడుదల చేసింది. పుష్పరాజ్ అలా అడవిలో ముందుకు వెళ్తున్న ఫోటోను వెనుక నుంచి చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న నేపథ్యంలో ఈ బ్యాక్ లుక్ పోస్టర్ మరింత ఆకర్షనీయంగా మారింది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా ఊర మాస్ అప్పియరెన్స్ ఇవ్వనుండటం ఆయన అభిమానులను హుషారెత్తిస్తోంది. మాసిన గడ్డం, బట్టలు, చెదిరిన జుట్టుతో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర ఓ రేంజ్లో ఉండనుందని ఫస్ట్ లుక్‌తోనే అర్థమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.