శ్రీముఖి కెరీర్ ను ఇరకాటంలో పడేసిన హైపర్ ఆది!

N.ANJI
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పండగలకు ముందు ఈవెంట్స్ ని చేస్తుంటారు. ఈవెంట్స్ లో యాంకర్లు, ఆర్టిస్టులు అక్కడ ఇక్కడ తారుమారు అవుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు తమ ఆర్టిస్టులు తమ ఛానల్ లోనే చేయాల్సి ఉంటుందని నియమాలు ఉండేవి. అయితే ఇప్పుడు అవేమీ లేనట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు సైతం ఇతర చానల్స్ లో పాల్గొని హంగామా చేస్తున్నారు. ఈటీవీ దసరా ఈవెంట్ లో యాంకర్ గా నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈవెంట్ లో హైపర్ ఆది కనిపించలేదు.

ఇక మరోవైపు జీ తెలుగులో ప్రదీప్, శ్రీముఖి ఈవెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సారి దీపావళికి మాత్రం ఈ టీవి చాలా గట్టిగా ప్లాన్ చేసింది. ఇక కనకమహాలక్ష్మి లక్కీ డ్రా విడుదలైన ప్రోమోలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా అనూప్ రూబెన్స్ ని తీసుకువచ్చారు. ఆ తర్వాత సోనుసూద్ ను ప్రోగ్రాం కు తీసుకొని వచ్చి మరో లెవల్ కి షోను తీసుకువెళ్లే ప్లాన్ చేశారు.

అయితే ఈవెంట్ లో హైపర్ ఆది స్కిట్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి పై పంచ్ వేశాడు. దీపావళి టపాసులు గురించి మొత్తం తెలుసా అని రోహిణి ఆదిని అడుగుతుంది. దానికి ఆది అంతా తెలుసు అని చెబుతాడు. ఆ క్రమంలోనే శ్రీముఖి భూ చక్రం అని అంటాడు. అంటే శ్రీముఖి అంతా తిరిగి వస్తుందా అని ప్రశ్నిస్తే… అవును ఆమె అన్ని షోలను చేస్తుంది అని ఆది కౌంటర్ వేశాడు. ఆ షో, ఈ షో అని తేడా లేకుండా అన్ని చోట్లా చేస్తుంది అనేసరికి శ్రీముఖి తలపట్టుకుంది. ఆ కౌంటర్ తో జీతెలుగు తప్పించి మిగతా వారు ఆమెతో ఈవెంట్లు ఏం చేస్తారో సందేహమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: