ఈ దెబ్బతో విజయ్ ఆంటోని కి హిట్ ఖాయం...!

VAMSI
తెలుగు ప్రజలకు నటన నచ్చితే చాలు ఏ ఇండస్ట్రీ వారినయినా అక్కున చేర్చుకుంటారు. అలాంటి తక్కువ  మంది నటులలో ఒకడు మన తమిళ తంబి విజయ్ ఆంటోనీ. కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఈయన స్వతహాగా సంగీత దర్శకుడు కాగా నటనలోనూ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈయన నిర్మాతగా కూడా కోన్ సినిమాలను తెరకెక్కించాడు. అప్పట్లో తెలుగు తమిళ్ లో విడుదలయిన బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. తెలుగు తమిళ ప్రజలు ఈ సినిమాని ఎంతగా ఆదరించారు అంటే ఒక మెగా హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఎలా ఉంటుందో అంతలా ఘన విజయాన్ని అందించారు.

ఆ తరువాత సినిమాలను చేస్తూ ఉన్నాడు కానీ ఒక్కటి కూడా తనకు కలిసి రాలేదు. ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు.ఇక్కడ రెండు భాషలలో మంచి విజయాన్ని సొంతంచేసుకోవడంతో దీనిని హిందీ, ఒడిశా, మరాఠా మరియు కన్నడ భాషలలో కూడా రీమేక్ చేసాడు. అయితే విజయ్ ఆంటోనీ మాత్రం హిట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. కాగా ఇప్పుడు మెట్రో వంటి డిఫరెంట్ కథాంశంతో విజయాన్ని అందుకున్న ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.  

ఈ చిత్రానికి టైటిల్ గా 'కోడియిల్ ఒరువన్' అనే పేరును ఖరారు చేసారు. అయితే దీనిని తెలుగులో 'విజయ రాఘవన్'అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి.రాజా డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను దీపావళి పర్వదినాన విడుదల చేసారు. అయితే దీనిని వచ్చే సంవత్సరం వేసవిలోనే విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా అయినా విజయ్ ఆంటోనీకి ఒక మంచి బ్రేక్ ఇస్తుందా అని ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: