ఆకాశం నీ హద్దురా హిట్ తో సూర్యకి మళ్ళీ పెరిగిన క్రేజ్....
ఇక తెలుగులో సూర్య మార్కెట్ పూర్తిగా పడిపోయినట్లే అనుకుంటున్న సమయంతో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ ఆయనకు తిరిగి గత వైభవాన్ని తీసుకోచ్చింది. విశ్లేషకుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. అసలు ఈ సినిమా ఓటీటీ విడుదల చేయకుండా థియేటర్లో రిలీజ్ చేస్తే మరింత హిట్ సాధించేదంటూ ప్రశంసలు దక్కతున్నాయి. సూర్య నటన, సుధా కొంగర డైరెక్షన్ సూపర్బ్.. అంటూ కొనియాడుతున్నారు. ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘ఆకాశం నీ హద్దురా’కు వస్తున్న రెస్పాన్స్‌తో పండగ చేసుకుంటోంది.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య.. ఒక్క విజయంతో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా విజయంతో ‘సూర్య ఈజ్ బ్యాక్’ అంటూ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘గజినీ’ తర్వాత సూర్యకు ఇదే బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని సర్టిఫై చేస్తున్నారు. సినిమా పేరుకు తగినట్లుగానే సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ విజయం సూర్యకు తెలుగులో మార్కెట్‌ను ఎన్నో రెట్లు పెంచడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.