చిరంజీవి సినిమా రీఎంట్రీ తర్వాత ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది.
ఖైదీ నెంబర్ 150 తీసిన వి.వి.వినాయక్ ఆ తర్వాత మరో
సినిమా చేయడానికి ఏకంగా ఏడాదిపాటు వేచి చూడాల్సి వచ్చింది. పోనీ మెగా కాంపౌండ్ లోనే మరో సినమా అవకాశం దొరికిందని సంబర పడ్డా కూడా ఇంటెలిజెంట్
మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో డీలా పడ్డారు వినాయక్. కట్ చేస్తే.. ఇప్పటి వరకు మరో
సినిమా చేయలేకపోయారు. తీరా చిరంజీవితో లూసిఫర్
రీమేక్ అవకాశం వచ్చిందన్న సంతోషం కూడా ఎక్కువరోజులు నిలబడలేదు. ఆ
రీమేక్ మూవీనుంచి కూడా వినాయక్ ని తప్పించారనే ప్రచారం జరుగుతోంది.
ఇక
సైరా నరసింహారెడ్డి విషయానికి వద్దాం. ఈ
సినిమా సురేందర్ రెడ్డిని మరో మెట్టు పైన నిలబెడుతుందని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే పాన్
ఇండియా క్రేజ్ తో విడుదలైంది సైరా.
సినిమా సూపర్ హిట్ అని మెగా కాంపౌండ్ చెప్పుకుంటున్నా.. ఇప్పటి వరకు సురేందర్ రెడ్డికి మరో
సినిమా అవకాశం ఎందుకు రాలేదు. పోనీ
పవన్ కల్యాణ్ తో
సినిమా అనౌన్స్ అయినా అది ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో కచ్చితంగా తెలియదు. అంటే
సైరా తర్వాత
సురేందర్ రెడ్డి కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నారమాట.
ఇప్పుడిక
కొరటాల శివ వంతు వచ్చింది.
చిరంజీవి సినిమాకోసం
కొరటాల శివ ఏడాదికి పైగా వేచి చూశారు. ఆచార్య అనే పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో మెసేజ్ ఓరియంటెడ్
మూవీ తీస్తున్నారు.
కొరటాల శివ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆ నమ్మకంతోనే చిరుతో ఆయనకి అవకాశం ఇచ్చారు
నిర్మాత రామ్ చరణ్. చిరుతో
సినిమా తీస్తున్నారనే పేరుంది కానీ.. దాని వల్ల
కొరటాల శివ కెరీర్ కి వచ్చే లాభం ఏంటో అర్థం కావడంలేదు. ఇప్పటికే ఈ సినిమాకోసం ఏడాది వేచి చూశారు, ఆ తర్వాత షూటింగ్ తో మరో ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. లాక్ డౌన్ ప్రభావం తగ్గిపోయి
సినిమా విడుదలయ్యాక కానీ
కొరటాల శివ మిగతా సినిమాల జోలికి వెళ్లే అవకాశం లేదు. మెగా కాంపౌండ్ లో ఇరుక్కుపోవడం వల్ల
శివ కెరీర్ కి అది పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది. మొత్తమ్మీద చిరు రీఎంట్రీ తర్వాత ఆయనతో సినిమాలు చేసిన, చేస్తున్న దర్శకులకు భారీ గ్యాప్ వస్తుందనే విషయం మాత్రం సెంటిమెంటల్ గా ప్రూవ్ అయింది.