మెహబూబ్ కన్నా మోనాల్ ఎందులో స్ట్రాంగ్..?

shami
బిగ్ బాస్ నుండి 10వ వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం ఆరుగురు హౌజ్ మేట్స్ ఎలిమినేషన్స్ లో ఉండగా మెహబూబ్ కు తక్కువ ఓట్లు రావడం వల్ల హౌజ్ నుండి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బిగ్ బాస్ నుండి లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ వారం నామినేషన్స్ లో మోనాల్, అరియానా, అభిజిత్, మెహబూబ్, సోహెల్, హారిక ఉన్నారు. వీరిలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని న్యూస్ బయటకు వచ్చింది.

అయితే మోనాల్ ను సేఫ్ చేసి మెహబూబ్ ను ఎలిమినేట్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది. టాస్క్ ఏదైనా సరే మెహబూబ్ తన 100 పర్సెంట్ ఇస్తాడు. అంతేకాదు ఫిజికల్ టాస్క్ లో తనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మోనాల్ ఇవేవి చేయకపోయినా సరే ఎలిమినేట్ అవలేదు. ఎలిమినేషన్ ప్రసెస్ ఆడియెన్స్ వేసే ఓట్లని బట్టే అని తెలుస్తున్నా సరే మోనాల్ ను సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అవడం ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది.

అఖిల్ తో ఫ్రెండ్ షిప్ చేయడం.. ప్రతి విషయంలో ఎమోషన్ అవడం.. టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫాం చేసింది కూడా లేదు. అయితే హౌజ్ లో అఖిల్ సపోర్టర్స్ అంతా కూడా మోనాల్ కు ఓటు వేస్తున్నారు. అందుకే ఆమె సేవ్ అవుతూ వస్తుంది. మెహబూబ్ కన్నా మోనాల్ ఎలా చూసినా స్ట్రాంగ్ కాదు కాని ఆమె ఎలిమినేషన్ నుండి తప్పించుకుని మెహబూబ్ ను బయటకు పంపించింది. మరి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి.                                              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: