సందడే సందడి.. ఈవారం 'క్యాష్' చూడాల్సిందే సుమీ.?

praveen
ఏదైనా షో కి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది  అంటే తనదైన వాక్చాతుర్యంతో ఎంతలా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తూ ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పంచుతూ వస్తుంది యాంకర్ సుమ. కాగా ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక సుమ క్యాష్  ప్రోగ్రాం లో ఎంతో స్పాంటేనియస్గా యాంకరింగ్ చేస్తూ ఎప్పుడు అదిరిపోయే పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా క్యాష్ షో కి ప్రతివారం నలుగురు గెస్టులు  వస్తూ ఉంటారు ఇక నలుగురు గెస్టు లతో ఎంతో సందడి సందడి చేస్తూ ఉంటుంది సుమా. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో క్యాష్ లో కొన్ని ఫన్నీ స్కిట్స్ చేయిస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. కాగా తాజాగా క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించి ఈ వారం ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



 ఇక ఈ ప్రోమో లో అందరూ బాల నటులే గెస్ట్ లుగా రావడం గమనార్హం. నరేష్ రిత్విక యోధ దీవెన సాహితీ విన్ని శ్రీమయి  మురారి గెస్ట్ గా వచ్చారు. ఈవారం క్యాష్ ప్రోమో కాస్త  పూర్తిగా సందడి సందడి నెలకొంది. చిన్నపిల్లల అందరితో ఎంతో సందడి చేసింది యాంకర్ సుమ. ఇక వారందరికీ ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ ఎంతో సందడి చేసింది. కాగా ప్రస్తుతం ఇటీవల విడుదలైన క్యాష్ ప్రోమో  కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూసిన అభిమానులు అందరూ ఈ వారం క్యాష్ షో చూడాల్సిందే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: