ఈ టైం లో ఇలాంటి రిస్క్ అవసరమా బాలయ్య..?

P.Nishanth Kumar
వెరైటీ రోల్స్ చేయడం లో బాలకృష్ణ కి సాటి ఎవరు రారు.. అంతేకాదు వేరే హీరోల సినిమాల్లో చిన్న పాత్ర అయినా నటించి అందరివాడు అనిపించుకున్నాడు బాలకృష్ణ.. అలాంటి బాలకృష్ణ ప్రస్తుతం ఫ్లాప్ లలో సతమతమవుతున్నారు.. నందమూరి బాలకృష్ణ కూడా గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..  

చిత్రం నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న ఓ సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో యంగ్ హీరో నాగశౌర్య ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ ను కీలక పాత్రలో నటింపజేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారట. బాలయ్యకు నిర్మాతకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.కొన్నాళ్ల క్రితం మంచు హీరో మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. సినిమాలోని బాలయ్య పాత్రకు కూడా పెద్దగా పేరు ప్రతిష్టలు వచ్చింది లేదు. ఆ సినిమాలో బాలయ్య నటించాడనే విషయాన్ని కూడా చాలా మంది అభిమానులు గుర్తు పెట్టుకోలేదు. మరి ఈ సినిమా అయినా బాలకృష్ణ కి హిట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: