ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఇక ఆగేదే లేదట..!!
ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ..తన తరువాతి ప్రాజెక్టును మళ్ళీ త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ కొత్త సినిమా ప్రకటించి దాదాపుగా ఎనిమిది నెలలు కంప్లీట్ అయ్యింది. తారక్ ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ విరామ సమయంలో త్రివిక్రమ్ మరో హీరోతో త్వరలోనే ఈ సినిమా రూపొందించబోతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచన మాటల మాంత్రికుడికి లేదని తాజాగా తెలిసింది. ఫిబ్రవరి నుంచి తారక్తో సినిమా షూటింగ్ ప్రారంభించిననున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.
చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించనుంది.ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. జాన్వీ కపూర్, పూజా హెగ్డే.. ఇలా పలువురు త్రివిక్రమ్ మనసులో ఉన్నట్లు చెప్పారు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం త్రివిక్రమ్, కీర్తి సురేష్‌ని సంప్రదించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కీర్తీ కనుక ఓకే చెబితే.. ఎన్టీఆర్,కీర్తీల కాంబినేషన్ ని మొట్ట మొదటి సారి వెండితెరపై చూడవచ్చు.ఇక వీటిపై త్వరలోనే అఫీషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!