రోజు రోజుకి యవ్వనంగా మారి ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు...!!!
ఎప్పటికప్పుడు సూపర్ స్టార్ తన పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆనందపరుస్తుంటాడు..కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 8 నెలలు పూర్తిగా ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటీవలే భార్య నమ్రత, కొడుకు, కూతురు లతో కలిసి దుబాయ్ ఫ్లైటెక్కారు.అక్కడ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ ని ప్రస్తుతం అక్కడి అందమైన ప్రదేశాలు చుట్టేస్తూ పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆయన.. చిల్డ్రన్స్ డే సందర్భంగా మనసుకు హత్తుకునే సందేశం పోస్ట్ చేశారు.దుబాయ్ ట్రిప్లో గౌతమ్, సితారలతో ఫన్ మోడ్లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ''ముగింపు లేని నవ్వులు, సరదా, ప్రేమ.. నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది.నా రెండు చిన్న పిల్లర్స్తో పాటు ఈ ప్రపంచం లోని పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రతిరోజూ ప్రకాశిస్తూనే ఉండండి'' అని పేర్కొన్నారు మహేష్.
ఈ ఫొటోలో ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మహేష్ కనిపిస్తుండటం సూపర్ స్టార్ అభిమానులకు కన్నుల పండగగా మారింది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...