ఆర్ ఆర్ ఆర్ ను కార్నర్ చేస్తున్న బిజినెస్ సమస్యలు ?

Seetha Sailaja
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కరోనా పరిస్థితులు వల్ల ఎదుర్కుంటున్న విచిత్ర పరిస్థితులకు ‘ఆర్ ఆర్ ఆర్’ ఒక పరిష్కార మార్గాన్ని చూపెడుతుందని తిరిగి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ సినిమాలు నిర్మాణం జరిగేలా ‘ఆర్ ఆర్ ఆర్’ సక్సస్ ఒక ఊపు ఇస్తుందని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు మార్కెటింగ్ సమస్యలు ఎదురౌతున్నాయి అంటూ వస్తున్న గాసిప్పులు ఇండస్ట్రీలో భారీ సినిమాల నిర్మాణం చేయాలి అని ఆరాట పడుతున్న బడా నిర్మాతలకు టెన్షన్ పెడుతున్నట్లు టాక్.


ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఈమధ్యనే మళ్ళీ ప్రారంభం అయింది. ఈ మూవీ మార్కెట్ కు మంచి ఊపు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రాజమౌళి దసరా రోజులలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈ మూవీ మార్కెట్ కు సంబంధించి భారీ స్థాయిలో ఎంక్వైరీలు వస్తాయని ఈ మూవీ మేకర్స్ భావించినట్లు టాక్.


అయితే జూనియర్ టీజర్ అనూహ్య స్పందన వచ్చింది కానీ మార్కెట్ పరంగా చెప్పుకోతగ్గ స్థాయిలో ఎంక్వైరీలు ఆఫర్లు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు బయ్యర్ల నుండి రావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం రానున్న రోజులలో ధియేటర్లు మళ్ళీ తెరుచుకున్నా ఎప్పటికి ప్రజలు తమ కరోనా భయాలను పక్కకు పెట్టి తిరిగి ధియేటర్లకు క్రితంలా భారీ సంఖ్యలో వస్తారు అన్న విషయమై క్లారిటీ లేకపోవడం.


దీనితో టాప్ హీరోకి సంబంధించిన ఒక భారీ సినిమా విడుదలై సూపర్ సక్సస్ సాధించి రికార్డు కలక్షన్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే భారీ సినిమాల బయ్యర్లకు ధైర్యం ఏర్పడుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో సంక్రాంత్రి రేసుకు ఒక టాప్ హీరో సినిమా విడుదలై కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేసే వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ బయర్లకు భయాలు వెంటాడుతూనే ఉంటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: