పూరి జగన్నాధ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మూవీ...!

VAMSI
40 ఏళ్లు కూడా నిండని బాద్ షా.. డైలాగ్స్ పండించడంలో డాన్... అతని మాటలు తూటాలుగా విసిరే  గొప్ప దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ వైపు అయితే.. నటనలో దిట్ట... నాట్యంలో ఘనుడు.. కళ్ళలో చిరుత లాంటి మెరుపు... డైలాగ్స్ లో పవర్... మెగా ఇంటి వారసుడు రామ్ చరణ్ మరోవైపు.. ఇలా ఈ మెగా హీరో, పవర్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ని వెండితెరకు 2007 లో  చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ పూరి.అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీరి కాంబో సూపర్ హిట్ అంటూ ప్రేక్షకులు హారతులు పట్టారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా తీయలేదు... కానీ ప్రేక్షకులు మాత్రం వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

మెగా హీరో రామ్ చరణ్ అగ్ర కథానాయకుడు గా ఎదిగాడు. అటు పూరి స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్ని అందించారు. ఆ తర్వాత... కాలం కలిసి రాక ప్రతిసారీ కెరీర్ గ్రాఫ్ డౌన్ అయ్యే సన్నివేశంలో బ్లాక్ బస్టర్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు పూరి. పట్టువదలని విక్రమార్కుడిలా పూరి తన టాలెంట్ ను నమ్ముకొని ముందుకు సాగారు.
ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరి పూర్తిగా బిజీ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం అందరి లవర్ బాయ్ హీరో విజయ్ దేవరకొండ తో స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించే పనిలో పడ్డాడు. అందులోనూ ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ త్వరలో ఒక బాలీవుడ్ చిత్రం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం.. అందులోనూ పూరి కు మెగా కాంపౌండ్ నుండి పిలుపు అందిందని సమాచారం.

ప్రస్తుతం ఆయనకి పలువురు చిత్రనిర్మాతల నుండి అవకాశాలు వచ్చాయట. రామ్ చరణ్ మళ్ళీ పూరి జగన్నాధ్ తో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నాడని.. చిరుత కలయికను మళ్ళీ రిపీట్ చేయాలని పలువురు చిత్రనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పూరి కూడా  కూడా చెర్రీ తో జతకట్టేందుకు రెడీగా ఉన్నాడని సమాచారం. ఇప్పటికే తను రాసిన స్క్రిప్ట్  ల నుండి చెర్రీ కి సూటయ్యే కథని వినిపించి ఓకే చేసారని సమాచారం... అయితే మెగా హీరో రామ్ చరణ్ తేజ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చి రెండో ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలో వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: