బిగ్ బాస్ బ్యూటీ ప్రయత్నాలు ఈ సినిమాతోనైనా ఫలించేనా...?

VAMSI
నటిగా తేజస్వి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.... అందులోనూ ఈమె అచ్చ తెలుగు అమ్మాయి. ఇక బిగ్ బాస్ లో హాట్ కంటెస్టెంట్ గా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మా టీవీ లో ఓ కామెడీ షోకి యాంకరింగ్, గతంలో చాలెంజ్ వంటి రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే... ఇలా బుల్లితెర వెండితెర రెండింటిలోనూ తన హవా చూపింది తేజస్వి. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఈమె పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది...

 నటి  తేజస్వి- రమ్య పసుపులేటి- సిమర్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "కమిట్ మెంట్"  లవ్ .. డ్రీమ్.. హోప్.. ఫైట్ .. అనేది టైటిల్ కి ట్యాగ్ లైన్. కాగా టైటిల్కి తగ్గట్టు నలుగురు ముద్దుగుమ్మల కమిట్మెంట్ వెనక కారణం ఏంటన్న విషయంపై వినూత్నంగా తెరకెక్కించాడు దర్శకుడు. హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అసలే హాట్ బాంబ్ గా పేరొందిన తేజస్వి మరింత చెలరేగి నటిస్తోందన్న గుసగుసలు  గట్టిగానే వినిపిస్తున్నాయి.

అందులోనూ తాజాగా కమిట్మెంట్ చిత్రబృందం రిలీజ్ చేసిన ఈమోజి దీనికి మరింత spicy జత చేసింది.రేపటితో శీతాకాలపు చలి అంతరించిపోతుంది! అంటూ పోజిచ్చింది తేజస్వి. కమిట్ మెంట్ టీజర్ వస్తోంది! ఈ బోల్డ్ అండ్ స్పైసీ మూవీ చూడడానికి రెడీగా ఉండండి అంటూ సిగ్నల్ ఇచ్చింది చిత్ర బృందం. ఇక సినిమాలో మరెంత మసాలా ఉంటుందోనని టాక్. మా సినిమా ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకోగల దని ఆశిస్తున్నాను చిత్ర యూనిట్ సభ్యులు. మరి ఈ సినిమా అయినా తేజస్వి కి మంచి పేరు తెచ్చి మరిన్ని అవకాశాలను తీసుకువస్తుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: