అందాన్ని పక్కన పెట్టేసిన మన బ్యూటీలు..!

NAGARJUNA NAKKA
గ్లామర్‌ గుమ్మరించిన భామలు ఒక్కసారిగా మారిపోయారు. నిండా మేకప్ వేసుకొని ఇంతకాలం బుట్టబొమ్మల్లా కనిపించారు. అందాల తారల్లా మెరిసిన ముద్దుగుమ్మలు పెర్‌ఫార్మెన్స్‌ రోల్స్ వస్తే తామేమిటో నిరూపించుకుంటారు. అవసరమైతే అడ్డంగా వున్న మేకప్‌ను తీసేశారు. లేదంటే లైట్‌గా టచప్‌ ఇస్తారు. గ్లామర్ నుంచి పెర్‌ఫార్మెన్స్‌లోకి యు టర్న్ తీసుకున్న ఆ అందాల భామలు ఎవరంటే..!

నటీనటులకు ఎవరికైనా.. మేకప్ వుంటేనే అందం. మేకప్ లేకుండా వీళ్లను ఊహించుకోవడం కష్టమే. ఒక్కోసారి  మేకప్ లేకుండా .. లేదంటే తక్కువ మేకప్‌తో నటించే పాత్రలు పోషించాల్సి వస్తుంది.  గ్లామర్‌కు  కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన పాయల్‌ లైట్‌ మేకప్‌తో దర్శనమిచ్చింది.

పాయల్‌ అంటేనే గ్లామర్‌. ఆర్ఎక్స్‌ 100 నుంచి  వెండితెరను హీట్‌ ఎక్కిస్తూ వచ్చిన పాయల్ ' అనగనగా ఓ అతిథి' సినిమాలో సాధారణ గృహిణిలా కనిపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇది. అర్ధరాత్రి అనుకోకుండా వచ్చిన ఓ అతిథి కారణంగా.. ఎలాంటి సమస్యలు తలెత్తాయన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం 20 ఆహాలో రిలీజ్‌ అవుతోంది.

గ్లామర్‌ రోల్స్‌తో సెటిలైన మరో హీరోయిన్‌ హెబ్బాపటేల్‌. అలా ఎలా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబాయ్‌ భామ 'కుమారి 21 ఎఫ్‌' తో గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత గ్లామర్‌ రోల్స్‌కు పరిమితమైన హెబ్బా 'ఓదెల రైల్వేస్టేషన్‌' మూవీలో మేకప్‌ లేకుండా ఫస్ట్ లుక్‌తో షాక్‌ ఇచ్చింది.

పాయల్‌ రాజ్‌పుత్‌.. హెబ్బా మాదిరి ప్రియమణి గ్లామర్ రోల్స్‌ చేయలేదు. కెరీర్‌ మొదట్లోనే పరుత్తి వీరన్‌ సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఆతర్వాత ప్రవరాఖ్యుడులో కాస్త గ్లామర్‌ గుప్పించినా. సక్సెస్ కాలేదు. ఈలోగా బుల్లితెర జడ్జిగా బిజీ అయింది ప్రియమణి.

ప్రియమణి తన కెరీర్‌లో పెర్ఫార్మెన్స్‌ రోల్స్‌నే ఎక్కువగా ఎంచుకుంది. మణిరత్నం విలన్‌ మూవీలో  ఓ సీన్‌లో డీ గ్లామర్‌గా కనిపించడమే కాదు.. యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. రాణా,  నటిస్తున్న విరాట పర్వంలో నక్సలైట్‌గా డిఫరెంట్ రోల్‌ పోషిస్తోంది.  లైట్‌ మేకప్‌తో.. ఇప్పటికే రిలీజైన స్టిల్‌తో ఆకట్టుకుంది ప్రియమణి.

పల్లెటూరు అమ్మాయి పాత్రంటే.. మేకప్‌ తగ్గించాల్సిందే. ఏ సినిమా చూసినా.. షైనింగ్‌ మేకప్‌తో మెరిసిపోయే సామ్స్‌.. రంగస్థలం కోసం.. మేకప్‌ తగ్గించి.. న్యూ లుక్‌తో ఆకట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: