పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మెగా వారసుడి మూవీ !

NAGARJUNA NAKKA
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని చెప్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాగే సినిమా సినిమాకి లెక్కలు మారిపోతుంటాయి. మెగాఫ్యామిలీతో కొంచెం డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నట్లు కనిపించిన డైరెక్టర్‌ ఇప్పుడు మళ్లీ దగ్గరవుతున్నాడట. రామ్‌ చరణ్‌ని డైరెక్ట్‌ చేయబోతున్నాడనే టాక్‌ వస్తోంది.

చిరంజీవి రీఎంట్రీ ప్లాన్‌ చేసుకున్నప్పుడు పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో సినిమా చెయ్యాలనుకున్నాడు. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో 'ఆటోజానీ'గా వస్తాడని అనౌన్స్‌మెంట్స్‌ కూడా వచ్చింది. కానీ సెట్స్‌కి వెళ్లాల్సిన టైమ్‌లో సెకండాఫ్‌ సెట్‌ కాలేదని ఈ ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత మెగాక్యాంప్‌లో మళ్లీ సినిమా చెయ్యలేదు పూరీ జగన్నాథ్.

చిరు సినిమా క్యాన్సిల్‌ అయ్యాక పూరీ జగన్నాథ్‌ మళ్లీ కొణిదెల హీరోలతో సినిమా చెయ్యలేదు. దీంతో పూరీకి, మెగాఫ్యామిలీకి మధ్య డిస్టెన్స్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మెగాఫ్యామిలీ నుంచే పూరీ జగన్నాథ్‌కి ఒక ప్రపోజల్‌ వెళ్లిందనే టాక్ వస్తోంది. పూరీ డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌ ఒక సినిమా చెయ్యబోతున్నాడని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

పూరీ జగన్నాథ్‌ 'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడు. పూరీ ఈజ్‌ బ్యాక్ అనే కాంప్లిమెంట్స్‌ కూడా వచ్చాయి. ఈ సక్సెస్‌ జోష్‌లోనే విజయ్‌ దేవరకొండతో 'ఫైటర్' తీస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇక ఈ సినిమా తర్వాత మనం కలిసి పని చేద్దామని ప్రపోజల్‌ పెట్టాడట రామ్ చరణ్. ఇక 'చిరుత'తో చరణ్‌ని లాంచ్‌ చేసిన పూరీ, ఈ ప్రపోజల్‌కి పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యాడని తెలుస్తోంది. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశముందని ఫిల్మ్‌ నగర్‌ టాక్.

మొత్తానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య తర్వాత పూరీ జగన్నాథ్, రామ్ చరణ్ సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఆటోజానీ ఎప్పుడైతే ఆగిపోయిందో.. అప్పటి నుంచి మెగా హీరోలతో పూరీజగన్నాథ్ సినిమా చేయలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: