శృంగార నటి వేశ్యవృత్తిలోకి !

నయన కృష్ణ వేశ్యవృత్తిలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా ప్రముఖులకు వలవేసి వారితో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనేలా చేసి దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోంది. తాజాగా ఈమె చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కన్నడ సినీపరిశ్రమలో శృంగార నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయన కృష్ణ బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్‌తో సన్నిహితంగా మెలిగి దాన్ని వీడియో తీయించింది. దీంతో ఆ వీడియో క్లిప్పింగులు చూపించి సదరు డాక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో చేసేదేమీ లేక డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఈ బ్లాక్ మెయిలింగ్ ముఠా కోసం వలపన్నారు. నయన కృష్ణ మోసానికి గురైన డాక్టర్ పోలీసుల సూచన ప్రకారం ఆమెకు ఫోన్ చేసి మొదట ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. దీంతో ఆ డబ్బు తీసుకోవడానికి వచ్చిన నయన కృష్ణ ముఠాకు చెందిన ముగ్గురులో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా మరొకడు తప్పించుకొని పారిపోయాడు. అతనితోపాటు నయన కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: