ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ ....??
కాగా దీనిని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే దీని తరువాత ప్రముఖ యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే మరొక సినిమా చేయనున్నారు ప్రభాస్. కాగా నాగ అశ్విన్ దర్శకతంలో తెరకెక్కనున్న సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనుండగా, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించనుండగా, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఇందులో ఒక కీలక పాత్ర చేయనున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి దీనిని సంక్రాంతి పండుగ తరువాత సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ సెట్ ని రామోజీ ఫిలిం సిటీ లో యూనిట్ సిద్ధం చేస్తోందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత వేగవంతంగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో దీనిని 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇక నేడు ఉదయం దీనితో పాటు ప్రభాస్ నటించనున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ ని 11.08.2022 గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిని బట్టి వచ్చే ఏడాది రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్, ఆపై ఏడాది మొత్తం రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరించనున్నారు......!!