బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరు..?

shami
బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో నాలుగు వారాలు జరుగనుంది. ఇక ఇప్పటికే విజేత ఎవరు.. టాప్ 5లో ఎవరు ఉంటారు అన్న లెక్కలు వేసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 20 ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఫైనల్ ఎపిసోడ్ టైం డేట్ ఫిక్స్ చేశారు.
16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4లో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 19 మందిలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే హౌజ్ లో ఉన్నారు. వీరిలో కూడా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ సీజన్ కు ఎవరు గెస్ట్ గా వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేదా సూపర్ స్టార్ మహేష్ ఈ ఇద్దరిలో ఒకరు గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయట. స్టార్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ ఈమధ్య ఆహా కోసం యాడ్స్ చేస్తున్నాడు. ఇక మహేష్ కూడా కరోనా టైంలో ఫ్లిప్ కార్ట్ కోసం యాడ్ చేశాడు. అందుకే వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వస్తారని అంటున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. సీజన్ 3ని కూడా హోస్ట్ గా చేసిన నాగ్ సీజన్ 4లో మరింత ఎనర్జీగా కనిపించారు.               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: