రష్మిక కావాల్సిందే అంటున్న అక్కినేని హీరో..!

shami
కన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉంది. అమ్మడు ఇక్కడ ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అనే టాక్ ఉంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ఆ సినిమా హిట్ అవడం ఆ తర్వాత గీతా గోవిందం సినిమాలో నటించి ఆ సినిమాను హిట్టు కొట్టడం జరిగింది. ఇక ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు ఆ తర్వాత నితిన్ తో భీష్మ అంటూ రెండు హిట్లు అందుకున్న ఏకైక హీరోయిన్ రష్మిక మందన్న.

అందుకే టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా ఆమె వెంట పడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉండగా లేటెస్ట్ గా అక్కినేని హీరో ఆఫర్ కూడా వచ్చిందని టాక్. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో రష్మికని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్. అఖిల్ హీరోయిన్ గా రష్మిక కావాలని మరి పట్టుపట్టాడని టాక్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తునాడు. ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. బ్యాచ్ లర్ సినిమా హిట్టైతే మాత్రం అఖిల్ ఆ వెంటనే సురేందర్ రెడ్డి సినిమాతో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి అఖిల్ కు జోడీగా రష్మిక నటిస్తుందా లేదా అన్నది చూడాలి.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: