థియేటర్ల ఓపెనింగ్ విషయంలో..!
థియేటర్ సిస్టమ్ ను ఒడ్డుకు చేర్చాలంటే.. టాప్ హీరోలు రంగంలోకి దిగాల్సిందేననే మాటలు ఊపందుకున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో బచ్చన్ హీరోలు సినిమా హాళ్లను సందర్శించవచ్చనే మాటలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి.ఐతే ఈలోపే అమీర్ ఖాన్ మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమా చూసేశాడు. అతి త్వరలో అక్షయ్ కుమార్ కూడా సినిమా హాళ్లను విజిట్ చేయనున్నాడనే మాటలు బాంద్రాలో కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
బీటౌన్ బ్యాచ్ ఇలా ఉంటే సౌత్ సైలంట్ గా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పటికే సౌత్ నుంచి కుదిరితే ముందుగా కోలీవుడ్ హీరోలు సినిమా హాళ్ళ ఓపెనింగ్ కు మద్దతు తెలిపి .. థియేటర్లలోనే తాము సినిమా చూడాలని కోరుకుంటున్నారట. రజనీ, కమల్ తో పాటు ధనుష్ లాంటివారు వచ్చేనెలలో సినిమా హాళ్లను సందర్శించవచ్చనే మాటలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే ఆ మజాను.. ఎక్కువగా ఆస్వాదించేది తమిళ తంబీలే.
తెలుగులో డిసెంబర్లో సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది అని వచ్చే విమర్శలకు సోలో బతుకే సో బెటర్ తాజా పోస్టర్ తో ఆన్సర్ దొరికేసింది. ఈ మూమెంట్ చూస్తుంటే డిసెంబర్ లో ఇంకో రెండు మూడు సినిమాలు ఖచ్చితంగా థియేటర్ లో రిలీజ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ మూమెంట్ ను ఎంకరేజ్ చేయడం కోసం మెగా హీరోలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోలు సినిమా హాళ్లను
సందర్శించి బూస్టప్ ఇవ్వొచ్చు. అయితే ఆ లోపు కరోనా సెకండ్ వేవ్ తాలుకు వార్తలు రాకుండా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఓవరాల్ గా ఎలా చూసినా బొమ్మకు బూస్టింగ్ ఇవ్వడానికి ఎంటైర్ సినీ పరిశ్రమ అమీర్ ఖాన్ ను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేసేలా కనిపిస్తుంది.