కూతురికి పుట్టినరోజు నాడు మంచి సర్ప్రైజ్ ఇచ్చిన స్టైలిష్ స్టార్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న "పుష్ప" సినిమా షూటింగ్ లో బాగా బిజీ అయిపోయాడు. అల్లు అర్జున్ ఎంత బిజీగా వున్నా కాని తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే తన భార్య స్నేహతో ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ తో ఆయన సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా ముద్దుల కూతురు అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడు క్యూట్ వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటాడు.ఆ వీడియోస్ ఫ్యాన్స్ ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. నెట్టింట్లో వైరల్ గా మారాయి కూడా. 2016, నవంబర్ 21న పుట్టిన అర్హ నేటితో నాలుగు సంవత్సరాలు  పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా బన్నీ తన కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌ అర్హ. నీ క్యూట్‌నెస్‌, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్‌ ఏంజెల్‌’ అని కామెంట్ చేస్తూ కూతురికి గిఫ్ట్‌ ఇస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌‌ చేశారు. దీంతో పాటు అర్హను గుర్రం ఎక్కించిన ఫోటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేశాడు...


ఇక సినిమా విషయానికి వస్తే... పుష్ప సినిమాతో బిజీగా వున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: