అవినాష్ లేడు అయినా కెవ్వు అనిపిస్తున్న కార్తిక్..!
అంతకుముందు మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ కాస్త.. కేవలం కెవ్వు కార్తిక్ గా స్కిట్స్ చేస్తున్నాడు. ఈమధ్యనే బాగా పాపులర్ అయిన ఇమ్మాన్యుయెల్ తో మంచి స్కిట్స్ చేస్తున్నాడు కార్తిక్. అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లాక అర్ధం కాని పరిస్థితుల్లో కార్తిక్ సోలో టీం లీడర్ గా సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. అయితే సోలో టీం లీడర్ గా ఆడియెన్స్ ను అలరిస్తేనే అతన్ని కెప్టెన్ గా కొనసాగనిస్తారు లేదంటే టీం తీసేసి అతన్ని వేరే టీం లో కలిపేస్తారు.
అయితే అవినాష్ లేకపోయినా సరే అదే కసితో కార్తిక్ సోలో టీం లీడర్ గా మంచి స్కిట్స్ రాసుకుంటూ అడపాదడపా టాప్ స్కిట్ గా ఛాంపియన్ గా కూడా నిలుస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లడం కార్తిక్ లో కసిని పెంచిందని చెప్పొచ్చు. కెవ్వు కార్తిక్ గా సోలో టీం లీడర్ గా కార్తిక్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు.