రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. అభిమానులు షాక్..?
ఇటీవలే మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి సినిమాలో నందమూరి హీరో సరసన నటించిన సనాఖాన్ ప్రేక్షకులను తన అందచందాలతో ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. కత్తి సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ హీరోగా నటించిన మిస్టర్ నూకయ్య అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది సనా ఖాన్ . ఈ సినిమా కూడా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.
ఇక ఆ తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన గగనం సినిమాలో అవకాశం దక్కించుకుంది. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి అవకాశాలు మొత్తం కరువై పోయాయి. కొన్నాళ్ళ వరకు అవకాశాలకోసం ఎదురు చూసిన ఈ అమ్మడు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సూరత్ కు చెందిన ముప్తి అనాస్ ను పెళ్లి చేసుకుంది. అత్యంత సన్నిహితులు బంధువుల సమక్షంలో సనా ఖాన్ పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.